సోనూసూద్ కు తెలంగాణ ప్రజలు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామంలో సోనూ కు గుడి కట్టారు. కోవిద్ -19 నేపధ్యంలో సోనూ సూద్ చేసిన సాయాలకు గుర్తుగా ఈ గుడి నిర్మించినట్టు జిల్లా అధికారులు తెలిపారు.

ఈ విగ్రహాన్ని ఆదివారం విగ్రహం చెక్కిన శిల్పి, స్థానికుల సమక్షంలో ప్రారంభించారు. విగ్రహం చుట్టూ తిరుగుతూ మహిళలు భజనలు చేశారు, ఆరతి ఇచ్చి పూజలు నిర్వహించారు. జానపద పాటలు పాడుతూ సోనూ సూద్ మంచితనాన్ని పొగిడారు.

కరోనా నేపథ్యంలో సోనూ ఎన్నో మంచి పనులు చేశారని, ఇంకా చేస్తున్నారని జిల్లా పరిషత్ సభ్యుడు గిరి కొండల్ రెడ్డి అన్నారు. మంచి హృదయంతో ఆపన్నులకు దేవుడిలా మారాడు.  పేదల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అందుకే ఆయన కోసం ఈ ఆలయాన్ని నిర్మించాం. ఆయన మాకు దేవుడని చెప్పుకొచ్చారు. 

దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలకు తన సాయహస్తం అందించాడు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి, తన సాయాన్ని అందించాడు. అందుకే ఆయనను ఎన్నో అవార్డులు వరించాయని ఈ ఆలయానికి ప్లాన్ చేసిన బృందంలోని సభ్యుడైన రమేష్ కుమార్ అన్నారు.

కరోనా కష్టకాలంలో సోనూసూద్ ప్రజలకు చేసిన సాయాన్ని దేశమే కాదు ప్రపంచం మొత్తం గుర్తించింది. అందుకే ఆయనను ఐక్యరాజ్యసమితి SDG స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు వరించింది. అందుకే మా ఊర్లో ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించామని, మిగతా దేవతల లాగే సోను సూద్‌కు కూడా నిత్యం పూజలు జరుగుతాయని.. ఆయన అన్నారు.

ఇక విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మధుసూదన్ పాల్ మాట్లాడుతూ.. సోనూ సూద్ విగ్రహాన్ని తయారు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ప్రజలకు చేసిన సాయానికి నేను అతని విగ్రహాన్ని తయారు చేసి కృతజ్ఞతను చాటుకున్నానన్నాడు. 

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి సోనూ చేసిన ఏర్పాట్లు అతన్ని సామాన్యులకు చాలా దగ్గర చేశాయి. ఆతరువాత అతని సాయాలన్నీ సామాన్యులకు తన సాయహస్తం అందించారు. 

ఎంప్లాయ్ మెంట్ ప్రొవైడర్లతో కలిసి వలసకార్మికుల కోసం జాబ్ పోర్టల్ ను ప్రారంభించాడు. సోషల్ మీడియా ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు ఆదుకోవడానికి ముందుంటున్నాడు ఈ 47 ఏళ్ల ఈ రియల్ హీరో. https://twitter.com/AsianetNewsTL/status/1340885279477886977