తెలంగాణ బీజేపీ నేత  రఘునందన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. సిద్ధిపేట జిల్లాలోని రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన ప్రసంగాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

టీఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు చేయడంతో గ్రామస్తులు ఆయన స్పీచ్ ను అడ్డుకొని తీవ్ర వాగ్వాదానికి దిగారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని గ్రామస్తులు తేల్చిచెప్పడంతో సమాధానం చెప్పుకోలేక రఘునందన్ రావు గ్రామం నుంచి వెళ్లిపోయారు. 
 

"