కేసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి మరో రికార్డు కొట్టింది

కేసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి మరో రికార్డు కొట్టింది

తెలంగాణలో ఎర్రవల్లి గ్రామం పేరు అందరికి ఎరికే. ఎందుకంటే ఆ గ్రామాన్ని సిఎం కేసిఆర్ దత్తత తీసుకుని అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. కేసిఆర్ దత్తత తీసుకున్న నాటినుంచి ఎర్రవల్లి గ్రామం రికార్డుల మోత మోగిస్తున్నది. తాజాగా మరో రికార్డును ఆ గ్రామం సొంతం చేసుకున్నది. ఆ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.

తెలంగాణ సర్కారు పేద అమ్మాయిల పెళ్లి తండ్రికి భారం కారాదన్న సదుద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం తొలినాళ్లలో ఎస్సీ, ఎస్టీలకు అమలు చేయగా తర్వాత అన్ని వర్గాలకు అందజేస్తున్నది. తొలుత 51వేలు ఇచ్చేవారు. తర్వాత ఆ సొమ్మను 75వేలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా లక్షా నూటా పదహారుకు పెంచింది సర్కారు.

లక్షా 116 రూపాయల పంపిణీ ఇవాళ షురూ అయింది. ఈ స్కీంలో తొలి జంటకు ఆ సొమ్మును అందజేశారు. అది ఎక్కడంటే.. సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం, సిఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో. కల్యాణ లక్ష్మి పథకం ద్వార పెంచిన  100116 రూపాయల చెక్ ను రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన వధువు అశ్విని కి పెళ్లి పందిరి లోనే అందజేశారు. ఆర్డీసి చైర్మెన్ నర్సారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గడా అధికారులు పాల్గొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos