Asianet News TeluguAsianet News Telugu

బైరి నరేష్‌పై చట్టపరంగా చర్యలు.. అయ్యప్ప భక్తులు ఆందోళన విరమించాలి: ఎస్పీ కోటిరెడ్డి

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌తో పాటు డోలు హనుమంతులను పోలీసులు వరంగల్‌ సమీపంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వికారాబాద్‌కు తరలించారు. 

vikarabad sp kotireddy on Bhairi Naresh Arrest
Author
First Published Dec 31, 2022, 3:42 PM IST

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌తో పాటు డోలు హనుమంతులను పోలీసులు వరంగల్‌ సమీపంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వికారాబాద్‌కు తరలించారు. నరేష్ అరెస్ట్‌ను వికారాబద్ ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ తీసుకొచ్చిన తర్వాత వారిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరేష్, హనుమంతులను పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. ఇక, డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో.. నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఇక, నరేష్‌పై కొడంగల్‌తో పాటు పలు పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదైంది. 

అయితే నరేష్‌ను పోలీసులు వరంగల్‌లో అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్నప్పటికీ నరేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో..  సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. ‘‘ఇటీవల కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మీటింగ్‌లో అయ్యప్పస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్,  ప్రోగ్రామ్ నిర్వహించిన  డోలు హనుమంతుని వికారాబాద్ జిల్లా పోలీసులు వరంగల్‌లో అదుపులోకి తీసుకోవడం జరిగింది’’ అని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. అయ్యప్ప భక్తులు ఆందోళన విరమించాలని  కోరారు. 

ఇక, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బైరి నరేష్‌పై కొడంగల్ పోలీసు స్టేషన్‌లో 153(ఏ), 295 (ఏ), 298, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. చట్ట ప్రకారం నరేష్‌కు శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios