వికారాబాద్ శిరీష హత్య కేసు .. కీలకంగా మారిన సెల్‌ఫోన్, మృతురాలి సోదరి వాదన ఇదే

తన చెల్లిని దారుణంగా చంపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వికారాబాద్‌ జిల్లాలో హత్యకు గురైన శిరీష సోదరి శ్రీలత.  శిరీష మొబైల్ ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె తెలిపారు. 

vikarabad sirisha sister srilatha comments on murder ksp

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష అనే ఇంటర్ విద్యార్ధినిని దుండగులు అత్యంత పాశవికంగా చంపడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. గొంతు కోసి దారుణంగా చంపిన దుండగులు, ఆపై స్క్రూ డ్రైవర్‌తో ఆమె రెండు కళ్లను పొడిచేశారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి శ్రీలత మాట్లాడుతూ.. తమ ఇంటికి దగ్గరలోనే వున్న నీటి గుంటలో శిరీష శవమై తేలిందన్నారు. తమ కుటుంబానికి ఎవరి మీదా అనుమానం లేదని శ్రీలత చెప్పారు. శిరీష మొబైల్ ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె తెలిపారు. 

చివరిసారిగా శనివారం రాత్రి శిరీష బయటకు వెళ్లి .. మళ్లీ తిరిగిరాలేదని, ఆ లోపే ఈ ఘోరం జరిగిందని శ్రీలత కన్నీటి పర్యంతమైంది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికామని, తెలిసినవాళ్లను ఎంక్వైరీ చేశామని చెప్పింది. ఈ క్రమంలోనే శిరీష మృతదేహాన్ని నీటి గుంతలో చూశామని శ్రీలత వెల్లడించింది. తన తల్లి అనారోగ్యం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఇంట్లోనే నేను, అన్నయ్య, శిరీష , తమ్ముడు వుంటామని చెప్పింది. 

ALso Read: వికారాబాద్ శిరీష హత్య కేసు : వీడని మిస్టరీ .. పోలీసుల అదుపులో మృతురాలి బావ

మరోవైపు శిరీష కేసును  పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణలో భాగంగా శిరీష బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం శిరీషపై అతను చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి బయటకెళ్లి అదృశ్యం కావడం, చివరికి శవమై తేలడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఈ ఘటనపై డీఎస్పీ మాట్లాడుతూ.. శిరీష హత్య వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే వుందని, దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios