వికారాబాద్ శిరీష హత్య కేసు : వీడని మిస్టరీ .. పోలీసుల అదుపులో మృతురాలి బావ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో ఇంటర్ విద్యార్ధిని శిరీష దారుణ హత్య కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే శిరీష బావను అదుపులోకి తీసుకున్నారు. 
 

vikarabad sirisha murder case updates ksp

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో ఇంటర్ విద్యార్ధిని శిరీష దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె నీటి గుంటలో శవమై తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణలో భాగంగా శిరీష బావ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం శిరీషపై అతను చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.

Also Read: చంపి, స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచేసి.. వికారాబాద్ జిల్లాలో యువతి దారుణహత్య

ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి బయటకెళ్లి అదృశ్యం కావడం, చివరికి శవమై తేలడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఈ ఘటనపై డీఎస్పీ మాట్లాడుతూ.. శిరీష హత్య వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే వుందని, దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. శిరీష సోదరి మీడియాతో మాట్లాడుతూ .. నిన్న రాత్రి నుంచి మా చెల్లి కనిపించకుండా పోయిందని చెప్పింది. దీంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఈ క్రమంలో నీటి గుంతలో శిరీష మృతదేహం కనిపించిందని చెప్పింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios