Asianet News TeluguAsianet News Telugu

ఈ సారి బీఆర్ఎస్ ఓటమి ఖాయం.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు...

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని.. సర్వేలు అదే సూచిస్తున్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. 

Vijayashanthi sensational comments on BRS defeat in telangana assembly elections - bsb
Author
First Published Oct 11, 2023, 9:12 AM IST

హైదరాబాద్ : బిజెపి నేత విజయశాంతి మరోసారి బీఆర్ఎస్ పార్టీ మీద  సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  షెడ్యూల్ కూడా ఉంది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజే ఆదిలాబాద్ లో బిజెపి సభ జరిగింది.  ఈ సభలో బిజెపి నేతలు కేసీఆర్ సర్కార్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

బిజెపి నేత విజయశాంతి.. తెలంగాణలో కేసీఆర్ పాలన మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి జరిగిన ప్రీపోల్ సర్వేల్లో బీఆర్ఎస్ ఈసారి గెలుపుకు దూరమవుతున్నట్లుగా చెబుతున్నాయి. దుర్మార్గం, దోపిడీ, అవినీతి,  నియంతృత్వంతో కెసిఆర్ ప్రభుత్వం నడుస్తోంది. ఆయన అహంకార పూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం. నాతోటి తెలంగాణ ఉద్యమకారులు, నేను  సంవత్సరాలుగా ఈ వాస్తవాన్ని చెబుతున్నాం. ఇప్పుడిప్పుడే మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు ఈ విషయాలు చేరుతున్నట్లుగా అనిపిస్తుంది’  అని కామెంట్ చేశారు.

తెలంగాణ విలీనంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. మండిపడ్డ బీఆర్ఎస్..

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో వ్యాఖ్యానించారు. ఈ అన్ని అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుని విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి జెండా ఎగరవేసే దిశగా కట్టుదిట్టమైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఆయన ఆదేశాలిచ్చారు. 

కేసీఆర్ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. దీన్ని బిజెపి అనుకూల ఓట్లుగా మార్చుకునే దిశగా ముందుకు సాగాలని ఆ సమావేశంలో అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటు అందించాలని.. దీనికి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉన్నదని అమిత్ షా హామీ ఇచ్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios