Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ చూసినా రెవెన్యూ వివాదాలే.. తెలంగాణలో పరిస్ధితి ఇదే: కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత దారుణంగా మరిందనే విషయం చెప్పడానికి గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలని ఆమె అన్నారు

vijayashanthi fires on kcr govt ksp
Author
Hyderabad, First Published Jul 1, 2021, 7:04 PM IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత దారుణంగా మరిందనే విషయం చెప్పడానికి గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలని ఆమె అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గేటుకి తాళిబొట్టు వేలాడదీసిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతు బీమా పరిహారం, రైతుబంధు అందలేదని రాములమ్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శివ్వంపేటలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు.

రెవెన్యూ లోపాలపై ప్రతి పత్రికలో, ప్రతి ఛానల్ లో ఈ సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయని ఆమె అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇలాంటి అనుభవాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉన్నాయని విమర్శించారు. కొంతమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా... పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి ఉందని చెప్పారు.

Also Read:రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళికట్టి మహిళ నిరసన: ఆర్టీఓ విచారణలో కీలక విషయాలు

ఈ ఇబ్బందులతో పాటు నకిలీ విత్తనాలు, పంట కొనుగోళ్ల ఇబ్బందులు ఉండనే ఉన్నాయని విజయశాంతి దుయ్యబట్టారు. భూ సమస్యలకు సర్వరోగ నివారణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని మండిపడ్డారు. ఈ వెబ్ సైట్ రైతులతో పాటు, ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోందని రాములమ్మ అన్నారు. తెలంగాణలో ఎలాంటి అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలని ఆమె చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios