Vijayashanti: బీఆర్ఎస్, కేసీఆర్‌కు రాములమ్మ కొత్త నిర్వచనాలు
Vijayashanti: బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని మనకందరికీ తెలిసిందే. కానీ, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో కొత్త నిర్వచనాలను ఇచ్చారు. వీటిని కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది. ఇంతకీ ఆ కొత్త నిర్వచనాలేంటో మీరు కూడా ఓ లూక్కేయండీ..
Vijayashanti: కాంగ్రెస్ నేత విజయశాంతి ఛాన్స్ దొరికినప్పుడల్లా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ఫై తనదైన సెటైర్లు వేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై బుక్ లెట్ విడుదల చేయడాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు.బీఆర్‌ఎస్‌ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘భవిష్యత్ రహిత సమితి(BRS) నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతలేని పరిస్థితికి చేరుకున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారీగా చేస్తుండగానే.. 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు. అది కూడా సిగ్గుమరిచి తెలంగాణ నెత్తిన రూ.6లక్షల కోట్ల అప్పు పెట్టిన దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజానికి గత 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరచకాల గురించి K కోతి C చేష్టల R రాజ్యం (కేసీఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలొచ్చు బహుశా..’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీనిని కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది.
అంతకు ముందు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రాల్లో 50 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు చిన్నవని చెప్పుకొచ్చారు.