ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ క్రాస్ సెంటర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా చైతన్యయాత్రలో పాల్గొన్న విజయశాంతి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. కేసీఆర్‌ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 

మహబూబ్‌నగర్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ క్రాస్ సెంటర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా చైతన్యయాత్రలో పాల్గొన్న విజయశాంతి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. కేసీఆర్‌ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 

చేతకాని కేసీఆర్‌ను గద్దె దించే రోజు దగ్గరలోనే ఉన్నాయని విజయశాంతి స్పష్టం చేశారు. ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్న రాములమ్మ కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే నాలుగున్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు వేరు, సీఎం అయిన తర్వాత వేరు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశామని కేసీఆర్ వెన్నంటి నడిచానని తెలిపారు. 

నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఓట్లేసి అధికారం కట్టబెడితే ఆ అధికారంతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు విజయశాంతి. కేసీఆర్ కుటుంబం దోపిడీ చెయ్యడానికి కాదు ప్రజలు ఓట్లేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

తెలంగాణ ప్రజల కష్టాలు కానీ...రైతుల కష్టాలు కానీ చూస్తుంటే తెలంగాణ ఆడపడుచుగా మీ రాములమ్మగా బాధేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే రైతన్నలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.