హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కొక్కరు విమర్శల ప్రతి విమర్శలతో రాజకీయ యుద్ధాన్ని తలపిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారంలో విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు.  

అయితే తాజాగా కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100సీట్లు రావడం కాదు కదా ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కు 104 జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలు గెలిచేందుకు స్థానాలను అడగాలే తప్ప.... కాంగ్రెస్‌ గెలిచే స్థానాలను అడగొద్దని రాములమ్మ సూచించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ సభలో అవమానం: కోపంతో ఊగిపోయిన రాములమ్మ

కుప్పకూలిన స్టేజి...వేదికపై నుండి కిందపడ్డ విజయశాంతి

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కేటీఆర్ లను బంగాళాఖాతంలో పడేయ్యాలి: విజయశాంతి