VHP: తెలంగాణలో శౌర్య యాత్ర నిర్వహించనున్న విశ్వహిందూ పరిషత్

Hyderabad: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు తెలంగాణలో విశ్వహిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) శౌర్య జాగరణ్ యాత్రను నిర్వ‌హించ‌నుంది. వీహెచ్‌పీ మీడియా ఇన్ చార్జి బాలస్వామి మాట్లాడుతూ.. "1964లో కృష్ణాష్టమి రోజున వీహెచ్‌పీని స్థాపించారు. అప్పటి నుంచి 6 దశాబ్దాలుగా తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతోంది. 59 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైందని" తెలిపారు.
 

VHP to hold 'Shaurya Jagran Yatra' from September 30 to October 15 in Telangana  RMA

Vishwa Hindu Parishad-Shaurya Jagran Yatra: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు తెలంగాణలో విశ్వహిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) శౌర్య జాగరణ్ యాత్రను నిర్వ‌హించ‌నుంది. వీహెచ్‌పీ మీడియా ఇన్ చార్జి బాలస్వామి మాట్లాడుతూ.. "1964లో కృష్ణాష్టమి రోజున వీహెచ్‌పీని స్థాపించారు. అప్పటి నుంచి 6 దశాబ్దాలుగా తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతోంది. 59 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైందని" తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తెలంగాణ వ్యాప్తంగా శౌర్యయాత్ర నిర్వహించనుంది. వీహెచ్ పీ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ఈ యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని భజరంగ్ దళ్ చీఫ్ నీరజ్ దోనేరియా ప్రారంభించనున్నారు. వీహెచ్ పీ మీడియా ఇన్ చార్జి బాలస్వామి మాట్లాడుతూ.. 1964లో కృష్ణాష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారు. అప్పటి నుంచి ఆరు దశాబ్దాలుగా తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతోంది. 59 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైందని తెలిపారు.

దేశంలోని ప్రతి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ 60 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు తెలంగాణలో శౌర్యయాత్ర నిర్వహిస్తున్నాం. నీరజ్ దోనేరియా బజరంగ్ దళ్ చీఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు తెలంగాణ అంతటా తమ యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు.

హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయానంద సరస్వతి సహకారంతో ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంఎస్ గోల్వాల్కర్, ఎస్ఎస్ ఆప్టే 1964లో విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్ పీ) ను స్థాపించారు. హిందువులను జాగృతం చేయడమే వీహెచ్ పీ లక్ష్యమని చిన్మయానంద పేర్కొన్నారు. దీనిలో భాగంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios