పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్: వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన, ఉద్రిక్తత

VHP, Bajarangdal workers protest dharna against police at Paripoornandha house in Hyderabad
Highlights

స్వామి పరిపూర్ణానంద అరెస్ట్ ను నిరసిస్తూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాండే అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్ట్ ను నిరసిస్తూ హిందూ సంఘాలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసనకు దిగాయి. కత్తి మహేష్ ను అరెస్ట్ చేయకుండా నగర బహిష్కరణ చేయడాన్ని హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. పరిపూర్ణానందస్వామి ఇంటి వద్ద పోలీసులతో  భజరంగ్ దళ్ , విహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాండే అనే ఓ  కార్యకర్త ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద సోమవారం నాడు యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రను తలపెట్టారు. అయితే ఈ యాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాదు స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ విషయం తెలుసుకొన్న విహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు స్వామి పరిపూర్ణానంద ఇంటి వద్దకు చేరుకొన్నారు. పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్ ను నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైద్రాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. 

పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు అర్చక సంఘం అధ్యక్షుడు పాండే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

మరోవైపు శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్ట్ సాయంత్రం వరకు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. 
 

loader