పాత సచివాలయ రక్షణకు రంగంలోకి దిగిన విహెచ్ 25న హైదరాబాద్ లో కొత్త పోరాటం షురూ
ఇప్పుడున్న సచివాలయాన్ని రక్షించుకోవడం కోసం కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొత్త పోరాటం మొదలు పెట్టనున్నారు.
తెలంగాణ సర్కారు డబ్బు దుబారా చేసేందుకే కొత్త సచివాలయం కడతామని చెబుతోందని విహెచ్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
దీనికితోడు సిఎం సచివాలయానికే రాడు అలాంటప్పుడు కొత్త సచివాలయం కట్టి ఏం లాభం అని కూడా ఆయన అంటున్నారు.
దీంతో ఈనెల 25న కొత్త సచివాలయం నిర్మాణంపై హైదరాబాద్ సిటీలో ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్లు విహెచ్ ప్రకటించారు.
మరి ఆ ప్రజా బ్యాలెట్ లో ఫలితాలు వచ్చినదాన్ని బట్టి ఆయన తదుపరి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటానని చెబుతున్నారు. మరి ప్రజా బ్యాలెట్ ఎలా ఉంటుందో చూద్దాం.
