సూర్యాపేట: సూర్యాపేట రూరల్ మండలం రాజనాయక్ తండాలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్సికోత్సవంలో భాగంగా జరిగిన స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలకు సూర్యాపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. 

ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణంలో దంపతులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ జగదీశ్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనాలు అందించారు.