హైదరాబాద్: ప్రాణంగా ప్రేమించిన మనస్విని తనను మోసం చేసిందని  ఆమె ప్రియుడు వెంకటేష్ చెప్పారు. తమ మధ్య గొడవ సందర్భంగా కత్తి ఆమె గొంతుకు తగిలిందని ఆయన వివరించారు.

ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జీలో మనస్విని అనే యువతిపై వెంకటేష్ అలియాస్ ప్రవీణ్ కుమార్  దాడికి దిగాడు. ఈ ఘటనలో  మనస్విని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వెంకటేష్ కూడ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

వెంకటేష్ తో  ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ  ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర  విషయాలను వెల్లడించారు.  తాను ప్రాణంగా ప్రేమించిన మనస్విని తనను మోసం చేసి వేరే యువకుడితో తిరుగుతోందన్నారు. 

దీంతో చివరి సారిగా మనస్వినితో మాట్లాడి చనిపోవాలని భావించినట్టుగా వెంకటేష్ చెప్పారు.  ఈ కారణంగానే ఆమెను తాను దిగిన లాడ్జీకి పిలిపించినట్టుగా వెంకటేష్ వివరించారు. తన ముందే  మనస్విని తన బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడిందన్నారు. దీంతో ఆమెతో గొడవకు దిగినట్టుగా వెంకటేష్ చెప్పారు.

ఈ విషయమై ఇద్దరి మద్య గొడవ జరిగిందన్నారు.ఈ గొడవలో తన చేతిలోని కత్తి  మనస్విని గొంతుకు తగిలిందన్నారు. కానీ తనకు మనస్వినిని చంపే ఉద్దేశ్యం లేదన్నారు.  ఆ తర్వాత తాను కూడ కత్తితో పొడుచుకొన్నట్టుగా వెంకటేష్ చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రేమోన్మాది దాడి: ఆసుపత్రిలో కోలుకొంటున్న మనస్విని