నాంపల్లి నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని ఎక్కడెక్కడి నుంచో వస్తువులను, వివిధ కళాకృతులను నుమాయిష్‌లో ప్రదర్శనకు తీసుకొచ్చిన వారు సర్వం కోల్పోయారు. 

నాంపల్లి నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని ఎక్కడెక్కడి నుంచో వస్తువులను, వివిధ కళాకృతులను నుమాయిష్‌లో ప్రదర్శనకు తీసుకొచ్చిన వారు సర్వం కోల్పోయారు.

దీంతో వ్యాపారులు నుమాయిష్ సోసైటీ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాల్సిందిగా గురువారం ఆందోళనకు దిగారు. సోసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వ్యాపారులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు వారిని సముదాయించి వెనక్కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రమాదం జరిగి 14 గంటలు కావొస్తున్నా అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ తమ దగ్గరకు రాలేదని వాపోతున్నారు.

న్యాయం కావాలని సొసైటీని ముట్టడించామని, రూ.లక్షలు అప్పు చేసి ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను ఏర్పాటు చేశామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. 30 నిమిషాల్లో అధికారులు రాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.

సొసైటీ సభ్యులు వచ్చి తమకు న్యాయం చేస్తామని మాట ఇవ్వాలని తెలిపారు. ఎక్కువగా కాశ్మీర్, యూపీ, బీహార్, గుజరాత్, కర్ణాటకకు చెందిన వ్యాపారులు ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై స్పందించిన నుమాయిష్ సొసైటీ గంటపాటు తమకు సమయమివ్వాలని బాధితులను కోరింది.

అందరికీ న్యాయం చేస్తామని, సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని, మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా..? షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నాంపల్లి నుమాయిష్ అగ్ని ప్రమాదం దృశ్యాలు

వదంతులు నమ్మెుద్దు, ప్రాణ నష్టం జరగలేదు: సీపీ అంజనీకుమార్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతి అయిన స్టాల్స్, తొక్కిసలాట వీడియో

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం: భయంతో పరుగులు, తొక్కిసలాట

81 ఏళ్ల నుమాయిష్ చరిత్రలోనే తొలిసారి మహా విషాదం