వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు దొంగలు ఉన్నారని ఆరోపించారు. తనను పక్కకు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు దొంగలు ఉన్నారని ఆరోపించారు. తనను పక్కకు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ తన చేతుల్లో లేదని.. పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. తాను ఇక్కడి నుంచి వెళితే భూకబ్జాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. తాను ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. పదవిపై తనకు వ్యామోహం లేదని తెలిపారు. పదవి ఉన్నా లేకున్న ప్రజల కోసం కోట్లాడతానని చెప్పారు. అయితే సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చెన్నమనేని రమేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక, వేములవాడలో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్‌కు చెక్ పెట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు జురుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చల్మెడ లక్ష్మీనరసింహరావు వేములవాడలో క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెన్నమనేని రమేష్.. ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.
