నటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమల్ హాసన్ నే మించిపోయారని విమర్శించారు నకిరేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. శ్రీనివాస్ హత్యలో కీలక పాత్రదారి అయిన గోపి అనే వ్యక్తి కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. వీరేశం ఇంకేమన్నారో చదండి.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై ఏ విచారణ కైనా నేను సిద్ధమే. రెడీ కావాల్సిందే కోమటిరెడ్డే. శ్రీనివాస్ ను ఇంటి నుండి పిలిపించిన గోపి కోమటి రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. జగదీష్ రెడ్డి నివాళులు అర్పిస్తే కూడా రాజకీయం చేశారు. ఎమ్మెల్యే వీరేశం ను రౌడిగా, గుండాగా చిత్రీకరించే ప్రయత్నం కోమటి రెడ్డి చేశారు. నేను శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎన్ని హత్య కేసులు నా మీద నమోదయ్యాయో కోమటిరెడ్డి నిరూపించాలి. చిట్యాల ఎంపీపీ ఎలక్షన్లలో ఘర్షణ కు మూల కారణం కోమటిరెడ్డే. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే కోమటిరెడ్డి ఆరోపణలు. నక్సలైట్ జీవితాన్ని వదిలి ప్రజలచే ఎన్నికై ప్రజా సేవకు అంకితమయ్యాను. దళితుడిని కావడం వల్లనే నాపై ఈ ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీనివాస్ ను హత్య చేసింది కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలే. రఘుమా రెడ్డి పై దాడి చేసింది కోమటిరెడ్డి కాదా? హత్యా రాజకీయాలకు తెర లేపి రాజకీయ పబ్బం గడుపుతున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. కార్యకర్తలు ఎదిగితే ఓర్వలేని గుణం కోమటిరెడ్డి ది. నటనలో కోమటిరెడ్డి కమల్ ను మించి పోయారు. కాంగ్రెస్ రక్త దాహ ఫలితమే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య. సూర్యాపేట,కోదాడ లో రక్త చరిత్ర రాశారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లాలోని రౌడీ షీటర్ లకు కేరాఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జానారెడ్డి నియోజక వర్గంలో పదుల సంఖ్యలో హత్యలు చేయించారు. పోలీసులు కాల్ డేటా ఆధారంగా సమగ్రంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణగా ఉంటాం. నయీమ్ అడ్డా గా నల్గొండ ను మార్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నయీమ్ ను పెంచి పొసించింది  కోమటి రెడ్డి బ్రదర్స్.

కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ లో గల్లంతయ్యింది.అందుకే వీరేశం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నల్గొండ లో కంచర్ల భూపాల్ రెడ్డి ని ఎదుర్కోలేకే ఆయనపై ఆరోపణలు లేవనెత్తారు. పొలిటికల్ భవిష్యత్తు కోసం శ్రీనివాస్ మమ్ములను కలిసిన మాట నిజం. వేముల వీరేశాన్ని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేకే కాంగ్రెస్ నాయకులు నా హత్యకు కుట్ర చేస్తున్నారు. రామకృష్ణకు ఇచ్చిన సుపారి, మీడియాలో వచ్చిన వార్తలు, వి హెచ్ మాట్లాడిన తీరు ఆధారంగా కోర్టులో కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొంటా.

చిరుమర్ధి లింగయ్య మీద కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హత్య కుట్ర చేస్తుండు. కమ్యూనిస్టులు,మార్కిస్టులు కుట్రలకు పాల్పడరు. మీడియా లో వచ్చిన ఫోటోలు అవాస్తవ కల్పితాలు. శ్రీనివాస్ హంతకులు అందరూ కోమటిరెడ్డి అనుచరులే. సిబిఐ విచారణ తో పాటు నార్కో ఏనాలసిస్ టెస్ట్ కు కూడా నేను సిద్ధం. మూడున్నర సంవత్సరాల కాల్ డేటా బయటపెడుతానికి నేను సిద్ధం.మరి కోమటి రెడ్డి సిద్ధమా. ఇవన్నీ కోమటిరెడ్డి డ్రామా కంపెనీ కల్పితాలు.