తెలంగాణ సచివాలయం: నుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు
తెలంగాణ సచివాలయంలో ఆదివారం నాడు ఉదయం సుదర్శన యాగం నిర్వహించారు.మంత్రి వేముల సుదర్శన్ రెడ్డి ఈ యాగంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణసచివాలయంలో ఆదివారం నాడు ఉదయం సుదర్శన యాగం నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో యాగం ప్రారంభమైంది., మేష లగ్నంలో సుదర్శన యాగం ప్రారంభించారు. ఆ తర్వాత ఛండీయాగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయంలోని ఆరో అంతస్తులో గల తన ఛాంబర్ లో ఆయన కూర్చుంటారు.
తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు కూడా తమ చాంబర్లలో ఆసీనులౌతారు. తన చాంబర్ లో ఆసీనులైన తర్వాత కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు సీఎం కేసీఆర్. గృహలక్ష్మి , హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ సంతకం చేస్తారు.
ఆ తర్వాత తెలంగాణ మంత్రులు, అధికారులనుద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు.
28 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయ నిర్మాణానికి గాను 8వేల టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. 60వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్ ను వాడారు. 11 లక్షల ఇటుకలను వాడారు.
తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు 2500 మందికి ఆహ్వానాలను ప్రభుత్వం పంపింది. కొత్త సచివాలయంలోకి ప్రవేశించాలంటే పాస్ లను ప్రభుత్వం జారీ చేయనుంది.2019 జూన్ 27న తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.కరోనా కారణంగా తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.
తెలంగాణ కొత్త సచివాలయంలో మొత్తం 655 గదులు, 30 కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి జంక్షన్ లో వాహనాలను దారి మళ్లించారు.