Asianet News Telugu

నోట్ల రద్దు దెబ్బ

డెబిట్, క్రెడిట్ కార్డులను తీసుకుంటారని ఊహించకపోవటంతో చేతిలో డబ్బు ఉండీ ఏమీ చేయలేక, కూరగాయలు కొనుగోలు చేయలేక వెనుదిరుగుతున్నారు.

veg Market
  • Facebook
  • Twitter
  • Whatsapp

 

క్రెడిట్, డెబిట్ కార్డులపై కూరగాయాల అమ్మకాన్ని ఎక్కడైనా చూసారా? హైదరాబాద్ లోని మోండామార్కెట్ లోని పై ఫొటోను చూస్తే రాష్ట్రంలోని పరిస్ధితి కళ్ళకు కట్టినట్లు కనబడతుంది. ఎక్కడ కూడా వెయ్యి, 500 రూపాయల నోట్లు చెల్లుబాటు కాకపోవటంతో ప్రజల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. దానికి తోడు ఎక్కడ కూడా 100, 50, 20 రూపాయల నోట్లు తగినంత చెలామణిలో లేకపోవటంతో దాని ప్రభావం కూరగాయల మార్కెట్లపై కూడా పడుతోంది. మార్కెట్ కు వచ్చే వారు కూడా పెద్ద నోట్లే తెస్తుండటంతో డబ్బులకు కూరగాయలు అమ్మటాన్ని వ్యాపారస్తులు ఆపేసారు.

 

  అయినా సరే ప్రజలు వస్తూనే ఉండటంతో చాలా మంది తాము కూరగాయలను కేవలం డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే అమ్ముతామని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే పలువురు వ్యాపారస్తులు బోర్డులు కూడా పెట్టేసారు. అయితే, కూరగాయల మార్కెట్ కు వచ్చే వారిలో అమ్మకందారులు డెబిట్, క్రెడిట్ కార్డులను తీసుకుంటారని ఊహించకపోవటంతో చేతిలో డబ్బు ఉండీ ఏమీ చేయలేక, కూరగాయలు కొనుగోలు చేయలేక వెనుదిరుగుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios