సిరిసిల్లా జిల్లా వేములవాడలో  చదువు ఇష్టం లేని  వరుణ్ అనే విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడాడు. కిడ్నాప్  డ్రామా విషయంలో  ఇంట్లో తాను చెప్పినట్టు తల్లికి చెప్పాలని తన తమ్ముడితో ఒట్టు వేయించుకొన్నాడు.


వేములవాడ: సిరిసిల్లా జిల్లా వేములవాడలో చదువు ఇష్టం లేని వరుణ్ అనే విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడాడు. కిడ్నాప్ డ్రామా విషయంలో ఇంట్లో తాను చెప్పినట్టు తల్లికి చెప్పాలని తన తమ్ముడితో ఒట్టు వేయించుకొన్నాడు. అంతేకాదు తమ్ముడికి చాక్లెట్ కొనిచ్చాడు . తమ్ముడిని ఇంటికి పంపించి తాను వరంగల్ బస్సు ఎక్కాడు. సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు వరుణ్ కోసం గాలింపు జరుపుతున్నారు.

 సిరిసిల్ల జిల్లా వేములవాడలో వరుణ్ అనే ఏడో తరగతి విద్యార్థి గురువారం నాడు ఉదయం స్కూల్ కు సోదరుడితో కలిసి వెళ్తున్నట్టు నమ్మించాడు. తమ్ముడితో కలిసి స్కూల్ కు వెళ్లాడు. చదువుపై అతనికి శ్రద్ద లేదు. దీంతో తనను కిడ్నాప్ డ్రామా ఆడాడు. తన సోదరుడితో కిడ్నాప్ డ్రామాను తల్లికి నమ్మించేలా చెప్పేలా ప్లాన్ చేశాడు.

 అంతేకాదు తమ్ముడికి చాక్లెట్లు ఇప్పించి ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్టు తల్లికి చెప్పేలా ప్లాన్ చేశాడు. అన్ని ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా తమ్ముడు ఇంటికి తల్లికి అదే స్టోరీ చెప్పాడు. చివరికి తమ్ముడిని పోలీసులు చాక్లెట్లు ఇచ్చి అసలు విషయాన్ని రాబట్టారు.

చదువంటే ఇష్టం లేని కారణంగానే తన సోదరుడు కిడ్నాప్ డ్రామాను ఆడించాడని అతను చెప్పాడు.సీసీ టీవీల పుటేజీ ఆధారంగా పోలీసులు ఆరా తీశారు. వరుణ్ వరంగల్ బస్సు ఎక్కినట్టు గుర్తించారు. వరుణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.