విజయ్ అక్రమ సంబధాల వీడియోలు రిలీజ్ (వీడియో)

విజయ్ అక్రమ సంబధాల వీడియోలు రిలీజ్ (వీడియో)

మృతుడు కమేడియన్ విజయ్ సాయి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడంటూ పలు వీడియోలను, ఫొటోలను విడుదల చేశారు ఆయన భార్య వనితారెడ్డి. విజయ్ సాయి ఇంట్లోనే వేరే అమ్మాయిలతో గడిపేవాడని ఆమె ఆరోపించారు. ఇంటికే అమ్మాయిలను తీసుకొచ్చి రాసలీలలు నడిపాడని వనితారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతానికి కొన్ని ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు వనితారెడ్డి.

తన వద్ద విజయ్ సాయికి సంబంధించి అక్రమ సంబంధాలపై మరిన్ని ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వాటిని కూడా బయటపెడతానని ఆమె తెలిపారు.

విజయ్ సాయితో తాను నాలుగేళ్ల క్రితం గొడవ పడి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తనకు సినిమాలు, టివి కార్యక్రమాల్లో అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

విజయ్ సాయి అక్రమ సబంధాలపై అత్తమామకు ఎన్నిసార్లు చెప్పినా.. వారు పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు తండ్రిని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే వనితారెడ్డి ఎక్కడికీ పారిపోలేదని ఆమె అందరికీ అందుబాటులోనే ఉన్నారని వనతిరెడ్డి తమ్ముడు రాంచందర్ రెడ్డి మీడియాకు తెలిపారు.

వనితారెడ్డి వీడియోలు రిలీజ్ చేయడంతో సినీ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page