Hyderabad: ఖమ్మంలో గేదెను వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రైలు సుమారు అరగంట ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. ఖమ్మంలో జరిగిన ఈ ఘటన రైలు నిర్మాణం నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. 

Vande Bharat Express hit a buffalo: గేదెను వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రైలు సుమారు అరగంట ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. అయితే, రైలు ముందుభాగం దెబ్బతినడంతో ఖమ్మంలో జరిగిన ఈ ఘటన వందేభారత్ ఎక్స్ ప్రెస్ నిర్మాణం నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వివ‌రాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా చింతకాని-నాగులవంచ రైల్వేస్టేషన్ మధ్య శనివారం సాయంత్రం వందేభారత్ ఎక్స్ ప్రెస్ గేదెను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో గేదె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. రైలు పాక్షికంగా దెబ్బ‌తిన్న‌ది. రైలు సుమారు అరగంట ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. అయితే, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ (29834) ఈ ఘటన కార‌ణంగా దెబ్బ‌తిన్న‌ది. ఖమ్మంలో జరిగిన ఈ ఘటన రైలు నిర్మాణం నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. 

కాగా, 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ రైలును ప్రారంభించినప్పటి నుండి జరిగిన అనేక సంఘటనలలో ఖమ్మంలో జరిగిన సంఘటన ఒకటి. గేదేలు, ఆవులను ఢీ కొన్న ఘ‌ట‌న‌లో వందే భార‌త్ రైళ్ల ముందుభాగాలు దెబ్బ‌తిన్నాయి. ఇప్పుడు ఖ‌మ్మం ఘ‌ట‌న‌లో కూడా ముందుభాగం దెబ్బ‌తిన్న‌ది. ఇది రైలు నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తింది.

ఇటీవల, భారతీయ రైల్వే టాటా స్టీల్ లో ఒప్పందం కుదుర్చుకుంది, దీని ప్రకారం వచ్చే సంవత్సరంలో దేశంలో అత్యంత వేగవంతమైన, మెరుగైన ప్ర‌యాణ ఫీచర్లతో కూడిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ 22 రైళ్లను కంపెనీ తయారు చేయ‌నుంది. రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చే రెండేళ్లలో 200 వందే భారత్ రైళ్ల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతేకాకుండా 2024 మొదటి త్రైమాసికం నాటికి వందే భారత్ మొదటి స్లీపర్ వెర్షన్ ను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.