హైద్రాబాద్ వనస్థలిపురం దోపీడీ కేసులో మరో ట్విస్ట్: రూ. 25 లక్షలు చోరీ అయినట్టుగా గుర్తింపు
హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురం దోపీడీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రూ. 25 లక్షలు దోపీడీకి గురైందని పోలీసులు గుర్తించారు. దోపీడీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం దోపీడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది . రూ. 25 లక్షలు దోపీడీ జరిగిందని పోలీసులు గుర్తించారు. సీసీటీవీల్లో నిందితులను గుర్తించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీన వనస్థలిపురంలో రూ. 2 కోట్లు దోపీడీకి గురైనట్టుగా వెంకట్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన పోలీసులai హవాలా వ్యవహరాన్ని గుర్తించారు. వెంకట్ రెడ్డి, ప్రవీణ్, ఫారూఖ్ లు హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్నారని గుర్తించారు. అమెరికాలో ఉన్న ప్రవీణ్ , వెంకట్ రెడ్డి, పాతబస్తీకి చెందిన ఫారూఖ్ లు హవాలా దందా నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోమవారంనాడు వెంకట్ రెడ్డి తోపాటు పాతబస్తీకి చెందిన ఫారూఖ్ నివాసంలో కూడ పోలీసులు సోదాలు చేశారు. వెంకట్ రెడ్డి నివాసంలో పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో హవాలా డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గుర్తించారు.
వెంకట్ రెడ్డి రూ. 50 లక్షలు, వెంకట్ రెడ్డితో పాటు ఉన్న నరేష్ అనే వ్యక్తి వద్ద రూ. 1.50 కోట్లు దోపీడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేసే సమయంలో పోలీసులకు వెంకట్ రెడ్డి పొంతలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హవాలా డబ్బు కావడంతో వెంకట్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా పోలీసులు తేల్చారు. వెంకట్ రెడ్డి స్కూటర్ డిక్కీలో రూ. 25 లక్షలను పోలీసులు గుర్తించారు. అయితే రూ. 25 లక్షలు దోపీడీకి గురైందని పోలీసులుగ గుర్తించారు. సీసీటీవీల్లో నిందితులను గుర్తించారు. దోపీడీకి ముందు వెంకట్ రెడ్డికి డబ్బులు చేరవేసిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. రూ.జ 25 లక్షలు దోపీడీ చేసిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హవాలా వ్యవహరంపై కూడ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
: