హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి. 7 వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మొదటి దశలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. విచారణ అనంతరం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.