రేవంత్ రెడ్డిని మేం వెళ్లగొట్టాలనడం లేదు: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు

కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గ్యాప్ ను  దిగ్విజయ్ సింగ్ చక్కదిద్దనున్నారని  మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆశాభావం వ్యక్తం  చేశారు.  ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగాలనేది తమ డిమాండ్ అని ఆయన  చెప్పారు.
 

V.Hanumantha Rao demands to Justice original Congress leaders

న్యూఢిల్లీ: దిగ్విజయ్ సింగ్  రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య  చోటు చేసుకున్న గ్యాప్ ను పరిష్కరించే అవకాశం ఉందని  ఆ పార్టీ సీనియర్  నేత  వి. హనుమంతరావు  అభిప్రాయపడ్డారు.మంగళవారంనాడు ఉదయం న్యూఢిల్లీలో వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ కు రాష్ట్రంలోని పరిస్థితులన్నీ తెలుసునన్నారు.దిగ్విజయ్ సింగ్  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి  ఇంచార్జీగా  పనిచేసినట్టుగా  హనుమంతరావు చెప్పారు.  పార్టీ నాయకులతో ఆయనకు  మంచి సంబంధాలున్నాయన్నారు.  అందరి నాయకుల గురించి దిగ్విజయ్ సింగ్ కు అవగాహన ఉందన్నారు. తెలంగాణలో పార్టీ నేతల మధ్య చోటు  చేసుకున్న పరిణామాలను దిగ్విజయ్ సింగ్  పరిష్కరిస్తారని ఆయన ధీమాను వ్యక్తం  చేశారు

పీసీసీ కోసం పెద్ద కమిటీని ఏర్పాటు చేశారన్నారు.ఈ కమిటీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్రంలో  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  అధిష్టానంలో కదలిక వచ్చిందని హనుమంతరావు  చెప్పారు.సీనియర్ నేతలు ఇవాళ నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని హనుమంతరావు సూచించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో  తనకు  సీనియర్లు సహకరించలేదని  రేవంత్ రెడ్డి  ఎలా చెబుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీలో కుర్చీ కోసం కొట్లాట జరుగుతుందని మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మీడియాలో రేవంత్ రెడ్డి  రాయించుకున్నారని  హనుమంతరావు గుర్తు చేశారు.రేవంత్ రెడ్డిని  తాము పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగించాలని కోరలేదన్నారు. అంతేకాదు ఆయనను పార్టీ నుండి వెళ్లగొట్టాలని కూడా కోరలేదన్నారు. రేవంత్ రెడ్డిలో మార్పు రావాలని తాము కోరుకున్నామన్నారు.ఇంతకాలం పాటు  తాము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన విషయం తెలియదా అని  వీహెచ్ ప్రశ్నించారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారే పార్టీని బలోపేతం చేస్తారని  చెప్పడం  హస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి వర్గీయులను రాజీనామా చేయాలని తాము  కోరలేదని హనుమంతరావు  చెప్పారు.మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి న్యాయం చేయాలని తాము కోరుతున్నామన్నారు. 

also read:తెలంగాణ కాంగ్రెస్‌‌పై హైకమాండ్ ఫోకస్: రంగంలోకి దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీలో కమిటీలు చిచ్చు రేపాయి. ఈ విషయమై ఈ నెల 12న  సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్కతో  కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు భేటీ అయ్యారు. పీసీసీ కమిటీల విషయమై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు వీహెచ్ న్యూఢిల్లీకి చేరుకున్నారు.  పార్టీ అగ్రనేతలతో  హనుమంతరావు  చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో  దిగ్విజయ్ సింగ్ ను పార్టీ పరిశీలకుడిగా ఎఐసీసీ నియమించింది. దిగ్విజయ్ సింగ్ కు పార్టీ రాష్ట్ర నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారం అయ్యేలా దిగ్విజయ్ చర్యలు తీసుకుంటారని  వీహెచ్ సహా  పలువురు సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios