Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ వేసిన కమిటీల గురించి తెలియదు: ఉత్తమ్

తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసిన కమిటీల గురించి తనకు తెలియదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ వేసిన మూడు కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Uttam Kumar Reddy says he does not about rahul gandhi committees
Author
Hyderabad, First Published Aug 25, 2018, 9:24 PM IST

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసిన కమిటీల గురించి తనకు తెలియదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ వేసిన మూడు కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఆ విధంగా ప్రతిస్పందించారు. 

100 సీట్లు గెలుస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మజాక్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 75 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

పీఆర్సీ పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. నాలుగు లక్షల మంది టీచర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు 25శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 ఈ కథనం చదవండి

తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలకు రాహుల్ గాంధీ షాక్

Follow Us:
Download App:
  • android
  • ios