అధిష్టానం పిలుపు: ఆఘమేఘాల మీద ఢిల్లీకి ఉత్తమ్

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 30, Aug 2018, 4:46 PM IST
Uttam Kumar Reddy leaves for Delhi
Highlights

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించడంతో ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించడంతో ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార కమిటీలపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ గాంధీతో జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు.  

loader