కేసిఆర్ తో టచ్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy in touch with KCR
Highlights

 తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు నేతలు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

న్యూఢిల్లీ: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు నేతలు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత మై హోమ్ రామేశ్వర రావు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని వారు ఫిర్యాదు చేశారని అంటున్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ నాయకులను కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు రాహుల్ గాంధీకి చెప్పినట్లు సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగితే పార్టీకి 2019 ఎన్నికల్లో 15 సీట్లు కూడా రావని వారు చెప్పినట్లు సమాచారం. 

వారి ఫిర్యాదులు విన్న రాహుల్ గాంధీ మరింత లోతుగా చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు అంగీకరించడం లేదు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వచ్చామని మల్లు భట్టి విక్రమార్క, డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 

రాహుల్ గాంధీతో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పార్టీ నాయకుల్లో ఏ విధమైన విభేదాలు లేవని వారు చెప్పారు. రెండు రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారని, అందుకే తమ వెంట రాలేదని వారన్నారు.

కాగా, కొంత మంది కాంగ్రెసు నేతలు తనపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. వారు తనపై ఫిర్యాదు చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. రాహుల్ గాంధీకి జన్మదీక్ష శుభాకాంక్షలు తెలపడానికే వారు ఢిల్లీ వెళ్లారని ఆయన అన్నాుర

loader