ఏపూరి సోమన్నకు బేడీలు వేయడం బాధాకరం సర్కారు దమనకాండకు నిదర్శనం ఎమ్మెల్యే భార్య అక్కడెందుకున్నారు?
ప్రజా కవి ..ఏపురి సోమన్న అరెస్ట్ చేయడం కేసిఆర్ ప్రభుత్వ దామనకాండకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా కళాకారుడు, తెలంగాణ కవి, గాయకుడు ఎపురి సోమన్నను కుటుంబ తగాదాల పేరుతో తిరుమలగిరి పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండించారు. దొంగలను, కేడీలను అరెస్ట్ చేసినట్టు ఏపురు సోమన్న కు బేడిలు వేయడం అధికార పార్టి దాష్టీకానికి నిదర్శనమన్నారు.
ఆ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య అక్కడ పోలీస్ స్టేషన్లలో ఎందుకున్నదిని ప్రశ్నించారు. పోలీస్ రాజ్యం నదువుతున్న పాలకులకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పాలకులను ప్రశ్నించే గొంతులను నులిపివేయడానికి కుట్ర పన్నుతున్నారు అని ఆరోపించారు. పోలీసులు రాష్ట్రంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దళితులు, బహుజనుల పైన దాడులు కోనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఈ విషయాలను తీవ్రంగా ఖండిస్తుంది. సోమన్నను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఈ అక్రమ నిర్బంధం పై వివరణ ఇవ్వాలన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
