ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసిఆర్ : ఉత్తమ్ చురక

First Published 17, Apr 2018, 5:40 PM IST
Uttam advises cm kcr to be wise enough in politics
Highlights

హైకోర్టు తీర్పు కేసిఆర్ కు చెంప పెట్టు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్  కుమార్ ల సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పును పిసిసి చీఫ్ ఉత్తమ్ స్వాగతించారు. ఈ తీర్పు హర్షణీయం అన్నారు. ఇది ఈ నిరంకుశ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజల, ప్రశ్నించే గొంతులను నులిమి వేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం అన్నారు. ఇప్పటి నుంచే కేసిఆర్ ప్రభుత్వ పతనం మొదలైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుందని, ప్రజల మద్దతు తో ముందుకు పోతుందని చెప్పారు. హై కోర్ట్ తీర్పును తెలంగాణ ప్రజలంతా స్వాగతిస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. అధికార దూరహంకారం తో, విచ్చల విడి చేష్టలతో విర్రవీగి పోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్దతిలో పాలన చేయాలని చురకలు వేశారు.

loader