Asianet News TeluguAsianet News Telugu

సుప్రీం తీర్పు హర్షణీయం

  • ఫిరాయింపు నేతలపై వేటు వేయాల్సిందే
  • మహబూబ్ నగర్ విద్యార్థిగర్జనలో ఉత్తమ్
  • ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
uthamkumar reddy on fee reimbursement

పార్టీ మారిన ఎమ్మేల్యేపై ఈరోజు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తప్పు చేశారని ఈ తీర్పు వల్ల తేటతెల్లమైందని చెప్పారు. రాజ్యాంగధర్మాసనం ఫిరాయింపు ఎమ్మేల్యేలపై సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మేల్యేలను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘణలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఫీజు బకాయిలను నిలివేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. లక్షలాది విద్యార్థులు ఫీజు రీ యింబర్స్ మెంట్ పై పోరాడుతూ రోడ్డెక్కుతున్నాసీఎం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ఫీజు రీ యింబర్స్ మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల నుంచి ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం వాళ్ల ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు.  ప్రభుత్వ అలసత్వం వల్ల 2.5 లక్షల మంది ప్రైవేటు కళాశాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక వైపు ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను ఫీజు కట్టాలని వేధిస్తుంటే... రీ యింబర్స్ మెంట్ పై స్పందించకుండా కేసీఆర్ విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.3 వేల కోట్లు దాటిందని తెలిపారు. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రమే ఆయన సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే డి.కె. అరుణ, జి. చెన్నారెడ్డి, ఎన్ఎస్ యూఐనేతలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios