పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 5 ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది.
పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. స్థానిక అమెరికన్ మీడియా ప్రకారం..మినీవ్యాన్ మరియు ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో మినీవ్యాన్‌లో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు, ట్రక్కులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, రెండు వాహనాల డ్రైవర్లతో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు మాత్రం సురక్షితంగా బయటపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించబడ్డారు.
తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదావరిగూడెంకు చెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి (26), వరంగల్ ఎల్లమ్మబజార్‌కు చెందిన గుల్లపెల్లి పావని(22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహ(23) యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూ హెవెన్, CT ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తుంది. వీరు ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు.
వీరంతా పండుగ పూట.. మరో ఐదుగురు మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కనెక్టికట్ రాష్ట్రంలో పొగమంచు కారణంగా ఉదయం 5 నుండి 7 గంటల మధ్య (స్థానిక కాలమానం ప్రకారం) ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్‌రెడ్డి, పావని, సాయినరసింహ అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన ఐదుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
సాయి నరసింహ స్నేహితులు అతని బంధువులకు సమాచారం అందించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన సాయి నరసింహ ఎంఎస్ చేస్తున్నాడు. చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను ఒక కంపెనీ రిక్రూట్ చేసింది. కానీ ఎంఎస్ చేయాలని ఉద్యోగం మానేసి, కనెక్టికట్‌లోని యూనివర్సిటీలో చేరాడు.
అతడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఎస్.ఈశ్వరయ్య అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడింది. మృతదేహాలను తీసుకొచ్చేందుకు కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సహకరించాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు.దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.
