హైద్రాబాద్ లలిత్ బాగ్ కార్పోరేటర్ బంధువుపై దుండగుల దాడి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైద్రాబాద్ నగరంలోని లలిత్ బాగ్ కార్పోరేటర్ కార్యాలయంలో కార్పోరేటర్ బంధువుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిిలో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
హైదరాబాద్: నగరంలోని లలిత్ బాగ్ కార్పోరేటర్ బంధువుపై సోమవారం నాడు సాయంత్రం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.లలిత్ బాగ్ కార్పోరేటర్ కార్యాలయంలోకి చొరబడిన దండగులు కార్పోరేటర్ బంధువుపై కత్తులతో దాడి చేశారు. కార్పోరేటర్ కార్యాలయంలోకి ఆరుగురు దుండగులు కత్తులతో ప్రవేశించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. కార్యాలయంలోకి ప్రవేశించి కార్పోరేటర్ బంధువైన ఇంటర్ విద్యార్ధి పై దాడికి దిగారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇంటర్ విద్యార్ధిపై దుండగులు ఎందుకు కత్తులతో దాడి చేశారనే విషయమై తేలాల్సి ఉంది.దాడికి గురైన విద్యార్ధి కార్పోరేటర్ కు అల్లుడు అవుతాడని సమాచారం. ఎంఐఎం కార్పోరేటర్ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయమై ఇంకా నిర్ధారణకు రాలేదు. కార్పోరేటర్ సోదరి కొడుకే బాధితుడని పోలీసులు చెప్పారు. లలిత్ బాగ్ కార్పోరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు దుండగుల దాడిలో మృతి చెందినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుతు మరణించారని పోలీసులు వివరించారు.