ఆ పార్టీలన్నీ ఇప్పుడు బిజెపికి వ్యతిరేకం, ఓటమి: రవిశంకర్ ప్రసాద్

First Published 31, May 2018, 4:56 PM IST
union minister Ravishankar prasad reacts   on by poll resuls
Highlights

ఆ పార్టీల వల్లే బిజెపికి షాక్

హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులకు
అనుగుణంగా ఉంటాయని కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి
రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

గురువారంనాడు ఆయన  మీడియాతో మాట్లాడారు. తాజాగా
వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఒక్క ఎంపీ, ఒక్క
ఎమ్మెల్యే స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ప్రస్తుతం బిజెపి వ్యతిరేక
పార్టీలుగా మారాయని ఆయన చెప్పారు. స్థానిక పరిస్థితులు
ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు.

ఐటీఐఆర్‌పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకొందని
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భూమి
సమస్లలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని
ఆయన సూచించారు.

ఏపీ ప్రభుత్వం భూమి ఇస్తే హైకోర్టు విభజనపై నోటీఫై
చేస్తామని ఆయన చెప్పారు. పెట్రోల్ ధరలను తగ్గింపు
విషయమై కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన చెప్పారు.
అయితే ప్రజలకు ఏ రకంగా మేలు కలుగుతోందోననే
విషయమై తాము ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
చేస్తామని ఆయన చెప్పారు. 

loader