మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం, వారికేం పనిలేదా: తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్

తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి ఫైరయ్యారు. తమతో చేసకొన్న ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇంకా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము నాలుగు దఫాలు ఎక్స్‌టెన్షన్ ఇచ్చామన్నారు.

Union minister Piyush Goyal serious Comments on Telangana Government over Paddy

న్యూఢిల్లీ:చేసుకొన్న ఒప్పందం మేరకు తెలంగాణ ప్రభుత్వం బియ్యం సరఫరా చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు.మంగళవారం నాడు కేంద్ర మంత్రి Piyush Goyal తో తెలంగాణ  Bjp నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి గోయల్ మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు.  గత ఐదేళ్లలో తెలంగాణ నుండి వరి ధాన్యం సేకరణను ఐదు రెట్టు పెంచామన్నారు. ఇప్పటికే నాలుగు దఫాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికీ రబీ ధాన్యాన్ని తెలంగాణ సర్కార్ డెలివరీ చేయలేదన్నారు. శనివారం నుండి ఎదురుచూస్తున్నామని తెలంగాణ మంత్రులు, ఎంపీలు చెబుతున్నారన్నారు. తాను వాళ్లను రమ్మని ఆహ్వానించలేదని మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. మా  పనుల్లో మేం బిజీగా ఉన్నామన్నారు. వారికేం పని లేదా.. Delhi లో వచ్చి కూర్చున్నారని తెలంగాణ మంత్రులనుద్దేశించి కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం  గందరగోళానికి గురి చేస్తోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు.  గత ఐదేళ్లలో తెలంగాణ నుండి ధాన్యం కొనుగోళ్లను ఐదు రెట్లు పెంచామన్నారు. 

also read:వరి ధాన్యం ఇష్యూ: తెలంగాణ మంత్రులకు షాకిచ్చిన పీయూష్ , ముందే బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్

ఇప్పటికి Paddy  ధాన్యం కొనుగోలు విషయమై  రాష్ట్రానికి నాలుగు  దఫాలు ఎక్స్ టెన్షన్ ఇచ్చామన్నారు. ఇప్పటికి Rabi  ధాన్యమే డెలివరీ చేయలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం fci కి ఇవ్వాల్సి ఉందన్నారు. అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్ను బియ్యం కొనుగోలు చేసేందుకు అనుమతించామన్నారు.బియ్యం తరలింపునకు రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న  ధాన్యం  అందించాలన్నారు. భవిష్యత్తులో పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ స్పష్టంగా చెప్పిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వేంటే ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

అయితే వానా కాలం వరి ధాన్యం కొనుగోలు విషయమై కూడ కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది.పార్లమెంట్ లో సోమవారం నాడు కేంద్ర మంత్రి Piyush Goyal తో Trs ఎంపీల బృందం భేటీ అయింది. రాష్ట్ర మంత్రులు వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించడానికి వచ్చిన విషయాన్ని ఎంపీల బృందం తెలిపింది. దీంతో  ఇవాళ మధ్యాహ్నం  మంత్రుల బృందానికి  పీయూష్ గోయల్  అపాయింట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ మంత్రుల కంటే ముందే బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చారు. బీజేపీ నేతలతో భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రులపై ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios