కరీంనగర్ కు మరో రైలు 


హైదరాబాద్: కాచిగూడ- కరీంనగర్‌ల మధ్య నడిచే కేసీజీ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్‌, మోర్తాడ్‌, మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. 

అదే రోజు మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. కరీంనగర్ పట్టణానికి మరో రైలును కూడ నడిపించే యోచనలో ఉన్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సికింద్రాబాద్ లో మల్టీస్టోర్డ్ కారు పార్కింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కరీంనగర్ , కాచిగూడ మధ్య 144 కి.మీ పొడవును రైలును పొడిగించినట్టు ఆయన చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గ్రీన్ ఎనర్జీ అవార్డు రావడం పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1813 కోట్లను మంజూరు చేసిందని ఆయన చెప్పారు.