కరీంనగర్ జైలులో బండి సంజయ్‌ను పరామర్శించనున్న కిషన్‌ రెడ్డి..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay) పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జైలులో (karimnagar jail) ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) మంగళవారం పరామర్శించనున్నారు. 

union Minister Kishan Reddy will meet Telangana BJP chief Bandi Sanjay in karimnagar jail

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay) పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జైలులో (karimnagar jail) ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) మంగళవారం పరామర్శించనున్నారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  ఆదివారం నాడు  Karimnagar పార్టీ కార్యాలయంలో  బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగడం.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు జ్యూడిషియల్ రిమాండ్‌కు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తున్న బండి సంజయ్, బీజేపీ కార్యకర్తల పట్ల తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సంజయ్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ఈ క్రమంలోనే జేపీ నడ్డా ఆదేశం మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నేడు కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్‌ను పరామర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ పర్యటనకు వెళ్లాల్సిన కిషన్ రెడ్డి.. నడ్డా ఆదేశం మేరకు దానిని రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన కరీంనగర్‌కు బయలుదేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్‌రెడ్డి కాసేపట్లో కరీంనగర్‌కు చేరుకోనున్నారు. 

Also Read: బండి సంజయ్ అరెస్ట్‌: నేడు క్యాండిల్ ర్యాలీలు, హైద్రాబాద్‌లో పాల్గొననున్న జేపీ నడ్డా

కరీంనగర్ జైలుకు చేరుకోనున్న కిషన్‌ రెడ్డి.. బండి సంజయ్‌ను పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ కార్యాలయాన్ని కూడా పరిశీలించనున్నారు. సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటుగా.. పోలీసులు వ్యవహరించిన తీరును తెలుసుకోనున్నారు. అంతేకాకుండా పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను కిషన్‌రెడ్డి పరామర్శించనున్నారు. 

మరోవైపు Bandi Sanjay అరెస్ట్ ను నిరసిస్తూ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా  క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు jp Nadda హైద్రాబాద్‌కు చేరుకుంటారు. నేడు సాయంత్రం హైద్రాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ వరకు నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొంటారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది.. కిషన్‌రెడ్డి
బండి సంజయ్‌ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మాస్క్ పెట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని, మంత్రులు నల్గొండ పర్యటనలో ఎవరూ మాస్క్ పెట్టుకోలేదని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం పోలీసులుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios