తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రం అభివృద్ది చెందాలని లేదని విమర్శించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రం అభివృద్ది చెందాలని లేదని విమర్శించారు. 
కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించడమే తెలుసునని మండిపడ్డారు. కేంద్రం అందించే సహకారం అందిపుచ్చుకునే ఆలోచన లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట.. కానీ ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే మాత్రం ఆయన వచ్చే తీరిక లేదని విమర్శించారు. కేసీఆర్ రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని తిరుగుతారని అన్నారు. 

ఇదిలా ఉంటే, ఆదివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్‌మెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేదని అన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వారి రాజకీయ ప్రయోజనాల కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే 125 అడుగుల ఎత్తైన డాక్టర్‌ బిఆర్‌ విగ్రహం పనులు పూర్తి చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో మార్పులు తేవాలని కోరిన రోజే కేసీఆర్ అసలు రంగు బయటపడిందని అన్నారు. కేసీఆర్‌కు ఇఫ్తార్ విందులకు సమయం ఉందని.. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేకపోతున్నారని విమర్శించారు.