న్యూఢిల్లీ:  దేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం నాడు  ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు.నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు.

పోలీసుశాఖను ఆధునీకరించి బలోపేతం చేస్తామన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతే తమ ప్రధాన లక్ష్యమన్నారు. దేశాభివృద్ధితో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  

తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతామన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది సంప్రదిస్తున్నారని... అందరినీ కూడ చేర్చుకొంటామని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా కేంద్రీకరించనున్నట్టు ఆయన తెలిపారు.