హైదరాబాద్: టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలతో కొత్తదనం లేదన్నారు. గత హామీలనే కేసీఆర్ మళ్లీ ప్రకటించారు. అక్షరం పొల్లుపోకుండా పాత మేనిఫెస్టోనే ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు.

హైద్రాబాద్ ను విశ్వనగరంగా కాదు విషాదనగరంగా మార్చారని ఆయన విమర్శించారు. సెలూన్లు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేనని ఆయన గుర్తు చేశారు. 

also read:అభివృద్ధి జరిగే హైద్రాబాద్ కావాలా... అగ్గిమండే హైద్రాబాద్ కావాలా: కేసీఆర్

పాతనగరానికి మెట్రోను దూరం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు.  మెట్రో రైలుకు ఏం చేశారో చెప్పాల్సిందిగా ఆయన అడిగారు. ఆరున్నర ఏళ్లలో మంచి పాలన చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ మరోసారి  ప్రయత్నించారని కిషన్ రెడ్డి చెప్పారు.