హైదరాబాద్:అభివృద్ది  జరిగే హైద్రాబాద్ కావాలా... ప్రతి రోజూ అగ్గిమండే హైద్రాబాద్ కావాలో తేల్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రజలను కోరారు.

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నిలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

also read:సినీ పరిశ్రమకు కేసీఆర్ వరాలు: రూ. 10 కోట్లలోపు సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్

కత్తిపోట్లు, కర్ఫ్యూలు, కల్లోల హైద్రాబాద్ వస్తే  మన పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదన్నారు సీఎం కేసీఆర్.

తప్పుడు శక్తులకు తప్పుడు వ్యక్తులకు ఓట్లేస్తే మనల్ని కాటేస్తాయని ఆయన ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పేరేత్తకుండా సీఎం కేసీఆర్ ఆ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు.

ప్రస్తుతం జరుగుతున్నవి చూసి ఇది చెబుతున్నానన్నారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్పడం తన బాధ్యతగా ఆయన ప్రకటించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేరే వాళ్లు (వేరే పార్టీ) గెలిస్తే ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం జీహెచ్ఎంసీకి అవసరమన్నారు.  

పిచ్చిపిచ్చి మాటలు విని ఉద్రేకపడుదామా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. విశ్వ నగరాన్ని అభివృద్ధి చేసుకొందామా .. వదిలేద్దామాని అని ఆయన ప్రశ్నించారు.

హైద్రాబాద్ లో కల్లోలాలు చెలరేగితే రియల్ ఏస్టేట్ పడిపోతోందన్నారు. భూముల ధరలు పడిపోతాయ్.. హైద్రాబాద్ మార్కెట్ పడిపోతోందని ఆయన ప్రజలను హెచ్చరించారు.

అందరి హైద్రాబాద్ కావాలా.. కొందరి హైద్రాబాద్ కావాలా తేల్చుకోవాలని ఆయన కోరారు.