అప్పులు చేసి అవినీతి: కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్
బీజేపీ అంటే టీఆర్ఎస్ భయపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.టీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీపై చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు.
హైదరాబాద్: BJP అంటే TRS భయపడుతుందని కేంద్ర మంత్రి Kishan Reddyచెప్పారు. నిన్న టీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీ పై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు.
గురువారం నాడు హైద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుణాత్మక పాలన అంటే నిజాం రాజ్యం లాంటి పాలనా? గుణాత్మకమైన పాలనా అంటే తండ్రీ కొడుకుల పాలనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనుకోవడం గుణాత్మక మార్పా అని ఆయన ప్రశ్నించారు.
అప్పు చేసి అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి KCR పై మండిపడ్డారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే భారత్ అన్నా మోడీ అన్నా ఒక గౌరవం ఉంటుందన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 22 వేల మంది భారతీయులను సురక్షితంగా ఇండియాకు రప్పించినట్టుగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను కేసీఆర్ ఏం ఉద్ధరించారని కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రి గా ఉండి కూడా ఢిల్లీలో ఉంటూ కేబినెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ వెళ్లలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో 65 వేల టీఎంసీల నీరు వృధా అవుతుందని కేసీఆర్ చెప్పడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జల వనరుల వినియోగంపై ఇప్పటికే కేంద్రం ఓ విధానాన్ని రూపొందించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నదుల అనుసంధానంపై కేసీఆర్ ఇల్లెక్కి గగ్గోలు పెడుతున్నారని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు
విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తారని Telanganaలో కేసీఆర్ సర్కార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందన్నారు. ఈ విషయమై కేంద్రం చెప్పినా కూడా తప్పుడు చేశారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అదే చేశారన్నారు.వరి ధాన్యం విషయమై కూడా ఇదే రకమైన అబద్దాలు ఆడారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అబద్దాలు ప్రచారం చేసే కేసీఆర్ కు అర్ధం కావడం లేదన్నారు.