గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు: కేసీఆర్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

తెలంగాణ బడ్జెట్  సమావేశాల్లో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  తో అబద్దాలు చెప్పించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. 

Union Minister Kishan Reddy Reacts on Tamilisai Soundararajan Speech in Telangana Assembly

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో  కేసీఆర్ సర్కార్  అబద్దాలు చెప్పించిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. 

శుక్రవారం నాడు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని కేసీఆర్  సర్కార్  గొప్పలు చెప్పుకుందన్నారు.

సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.   తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్​తో రాష్ట్ర ప్రభురత్వం  చెప్పించిందన్నారు.  కానీ బిల్లులందక అందక సర్పంచ్ లు  ఆత్మహత్యలు  చేసుకుంటున్నారని మంత్రి విమర్శించారు.  

 ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆదాయం పెరిగిందని  ప్రభుత్వం  చెప్పుకుంటుందన్నారు.  16 వేల మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రాన్ని రూ.  5 లక్షల కోట్ల  అప్పుల్లోకి నెట్టిందని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  

రైతు బంధు ఇస్తున్నా వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో  సమాధానం లేదన్నారు.  ‘ధరణి’ రైతుల్ని దగా చేస్తుంటే తప్పులు సవరణపై స్పందించే నాధుడే లేడన్నారు.  

కేంద్రం నిధులతో నడుస్తున్న బస్తీ దవాఖానాలను తమ ప్రభుత్వం చేసిన ఘన కార్యాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  ఏడాదిలోపు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుందన్నారు.  కానీ  రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లతో  వివాదాలను  సృష్టిస్తుందన్నారు.  

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌టీపీసీ  ద్వారా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని   కూడ  రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనంగా  ఆయన  పేర్కొన్నారు. ఇకనైనా అబద్ధాలను ప్రచారం చేయడం మాని రాష్ట్ర సంక్షేమంపై దృష్టిపెట్టాలని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   సూచించారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios