హైదరాబాద్: జనసేన, బీజేపీ పొత్తు విషయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 

ఈ నెల 19వ తేదీన బీజేపీ అగ్రనేతలు పవన్ కళ్యాణ్ ను కలుస్తారని ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు..జనసేనతో పొత్తు లేదని బీజేపీ చీఫ్ ప్రకటించిన తర్వాత ఈ ప్రచారం ఎందుకు సాగుతోందోనని కమలదళం నేతలు ఆరా తీస్తున్నారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: జనసేన పోటీ ఎవరికి లాభం?

జీహెచ్ఎంసీపై బీజేపీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ తరుణంలో ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్దులను కూడా ఖరారు చేసింది.

ఈ తరుణంలో పొత్తు విషయమై చర్చలు చేయడం అర్ధం లేనిదనే భావనలో బీజేపీ నాయకత్వం ఉంది.మరో వైపు ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతామని బండి సంజయ్ నిన్న ప్రకటించారు. జనసేన కూడ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా ప్రకటించింది.

also read:అప్పుడుకాంగ్రెస్ బొక్కబోర్లా: పవన్ తో పొత్తుకు బిజెపి నిరాకరణ వెనక...

జనసేన అభ్యర్ధులతో పాటు బీజేపీ అభ్యర్ధుల తరపున కూడ పవన్ కళ్యాణ్ ఎలా ప్రచారం చేస్తారనే అనే ప్రశ్న కూడ ఉత్పన్నమౌతోంది.బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను కలుస్తారని జనసేన నేతలే మీడియాకు  ఈనెల 19న ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ఎలాంటి చర్చలు లేవన్నారు. 

 బీజేపీ నేతలు పదే పదే పొత్తు విషయమై స్పష్టత ఇచ్చినా కూడ... ఎందుకు ఈ రకమైన ప్రచారం సాగుతోందనే విషయమై కాషాయవర్గాలు ఆరా తీస్తున్నాయి.