ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . మేము టీఆర్ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఇంత గందరగోళం సృష్టించ డం ఎందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . మంగళవారం బీజేపీ (bjP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడ మీద కత్తి పెట్టి సంతకం చేయించుకున్నారని అనడం దురదృష్టకరమన్నారు. బాయిల్డ్ రైస్‌పై అగ్రిమెంట్ చేసుకుంది తెలంగాణ సర్కారేనని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. మేము టీఆర్ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఇంత గందరగోళం సృష్టించ డం ఎందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

కాగా.. ధాన్యం సేకరణపై (paddy procurement) కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా బాయికాట్ చేస్తున్నామని ప్రకటించారు. సమావేశాలను బాయ్‌కట్ చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. 

Also Read:TRS: పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్.. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందంటూ ఫైర్..

లోక్‌సభలో 9 మంది, రాజ్యసభలో 7 మంది సభ్యులు సమావేశాలను బాయ్‌కట్ చేస్తున్నట్టుగా చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని.. వాతావరణ పరిస్థితుల వల్ల రా రైస్ రాదని తెలిపారు. రబీ ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలోనే తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఇక, పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) ప్రారంభమైన తొలి రోజు నుంచే ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నల్ల చొక్కాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలలో నిరసన తెలియజేశారు. లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని నినాదాలు చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.