Asianet News TeluguAsianet News Telugu

ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ అడ్డా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


టీఆర్ఎస్ పార్టీ నేడు ఉద్యమ ద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు..జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు

Union minister Kishan Reddy comments on TRS
Author
Karimnagar, First Published Oct 26, 2021, 6:43 PM IST

 కరీంనగర్: Trs పార్టీ ఉద్యమ ద్రోహులకు.. ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సభలో Kishan Reddy ప్రసంగించారు.నాడు తెలంగాణ పోరాటాన్ని అణచి వేసిన వాళ్లే ఉద్యమకారులను వేధించిన వాళ్లే కెసిఆర్ దగ్గర కనిపిస్తున్నారుమిడిల్ క్లాస్ నుంచి వచ్చిన Etela Rajender పై కేసీఆర్ కక్షగట్టి అతన్ని ఆయన భార్య మీద కుటుంబం మీద కేసులు పెట్టి జైలుకు పంపాలని ఆలోచన చేశారన్నారు.

also read:కుక్కను నిలబెట్టినా గెలిపిస్తారు.. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే ఈటల గెలవాలి: బీజేపీ నేత తరుణ్ చుగ్

Huzurabad కు ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలో మీరే నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.ఈటెల తన కష్టం  తాను పడుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంత వాసులకు ఎంతో సేవ చేశారని ఆయన గుర్తు చేశారు.ఈటల రాజేందర్ ఎవరి దగ్గర లంచాలు తీసుకొనే వ్యక్తి కాదన్నారు.ఈటెల ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి .కెసిఆర్ లాగా  పెద్ద ధనవంతుడు కాకపోవచ్చు కానీ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి ఆయన చెప్పారు. మీ కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటాడు..మీ సమస్యలను అసెంబ్లీ లో  వినిపిస్తాడని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం సమయంలో పనిచేసిన కళాకారులు, కవులు, విద్యార్థులు మేధావులు అంతా రాజేందర్ వైపే ఉన్నారని ఆయన చెప్పారు.అసెంబ్లీలో మీ గుండె చప్పుడు వినిపించేవారు కావాలా కేసీఆర్ కుటుంబానికి జి హుజూర్ అనే వ్యక్తి కావాలా నిర్ణయించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు
 

Follow Us:
Download App:
  • android
  • ios