మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడితో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. టీఆర్ఎస్కి లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీకి లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేదని ఆయన ఆరోపించారు.
మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అడిగారు.
ఇక, మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్స్ ఫలితాలు వెలువడగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 700 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
