హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ లు శుక్రవారం నాడు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

also read:బీజేపీ, జనసేన పొత్తుపై గందరగోళం: భేటీలపై అయోమయం

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో  తాము కూడ పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది.జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. 

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

జనసేనతో పొత్తు లేదని బీజేపీ చీఫ్ సంజయ్ ప్రకటించిన మరునాడే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది.ఈ తరుణంలో అన్ని రకాల శక్తులను కూడదీసుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ తో చర్చలు జరుపుతున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరుతామని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం  చేయాలని ఆహ్వానించేందుకు వెళ్లారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.